Chorus
సర్వజనులారా వినుడి - మీరేకంబుగా వినుడి
Verse
లోక నివాసులారా సామాన్యులు ఘనులేమి
దరిద్రులు ధనికులేమి - సర్వజనులారా వినుడి
Verse
నా హృదయ ధ్యానము పూర్ణ - వివేకమును గూర్చినది
నే పల్కెద జ్ఞానాంశముల - సర్వ జనులారా వినుడి
Verse
గూడార్థాంశము వినెద - చేతబట్టి సితార
మర్మము దెల్పెద నేను - సర్వ జనులారా వినుడి
Verse
నాకై పొంచిన దోషుల - క్రియలు నన్ను చుట్టన్
ఆపదలో భయపడనేల - సర్వ జనులారా వినుడి
Verse
తమ ధన సంపదనుబట్టి - పొగడుకొనెడు వారికి
నేనేల భయపడవలెను - సర్వ జనులారా వినుడి
Verse
ఎవడేరీతినైన నిత్యము బ్రతుకునట్లు
సోదరుని రక్షించలేడు - సర్వ జనులారా వినుడి
Verse
వాని నిమిత్తము దైవ - సన్నిధి ప్రాయశ్చిత్తము
చేయువాడెవ్వడు లేడు - సర్వ జనులారా వినుడి
Verse
ప్రాణ విమోచన ధనము - బహు గొప్ప దెన్నటికిని
తీరక యుండవలసినదే - సర్వ జనులారా వినుడి