Verse
సర్వకృపానిధియగు ప్రభువా
సకల చరాచర సంతోషమా‖ 2x ‖
స్తోత్రము చేసి స్తుతించెదను
సంతసముగ నిను పొగడెదను‖ 2x ‖
Chorus
హల్లెలూయా హల్లెలూయా… హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదను
నేను… ఆనందముతో సాగెదను
Verse
ప్రేమించి నన్ను వెదకితివి
ప్రీతితో నను రక్షించితివి‖ 2x ‖
పరిశుద్ధముగా జీవించుటకై
పాపిని నను కరుణించితివి‖ 2x హల్లెలూయా ‖
Verse
అల్పకాల శ్రమలనుభవింప
అనుదినము కృపనిచ్చితివి‖ 2x ‖
నాథుని అడుగుజాడలలో
నడుచుటకు నను పిలిచితివి‖ 2x హల్లెలూయా ‖
Verse
మరణ శరీరము మర్పునొంది
మహిమ శరీరము పొందుటకై‖ 2x ‖
మహిమాత్మతో నను నింపితివి
మరణ భయములను తీర్చితివి‖ 2x హల్లెలూయా ‖
Verse
భువినుండి శ్రేష్ట ఫలముగను
దేవునికి నిత్య స్వాస్థ్యముగా‖ 2x ‖
భూజనములలోనుండి నన్ను
ప్రేమించి క్రయ ధనమిచ్చితివి‖ 2x హల్లెలూయా ‖
Verse
ఎవరూ పాడని గీతములు
యేసుతో నేను పాడుటకై‖ 2x ‖
హేతువు లేకయే ప్రేమించెన్
యేసుకు నేనేమివ్వగలన్‖ 2x హల్లెలూయా ‖