Chorus
సర్వకృపానిదియగు ప్రభువా
సకల చరాచర సంతోషమా
స్తోత్రము చేసి స్తుతించెదము
సంతోషముగా నిను పొగడెదము‖ సర్వ ‖
Chorus
హల్లెలూయ హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా యని పాడెదము
ఆనందముతో సాగెదము
Verse
ప్రేమించి నన్ను వెదికితివి
ప్రీతితో నన్ను రక్షించితివి
పరిశుద్ధముగ జీవించుటకై
పాపిని నన్ను కరుణించితివి‖ సర్వ ‖
Verse
అల్పకాలశ్రమలనుభవింప - అనుదినము కృపనిచ్చితివి
నాదుని అడుగు జాడలలో
నడుచుటకు నను పిలిచితివి‖ సర్వ ‖
Verse
మరణ శరీరము మార్పు నొంది
మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నన్ను నింపితివి
మరణ భయములను తీర్చితివి‖ సర్వ ‖