Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarvaloka Nivasulara Anandinchu Dellaru

సర్వలోక నివాసులారా ఆనందించు డెల్లరు

Sarvaloka Nivasulara Anandinchu Dellaru

Verse
సర్వలోక నివాసులారా - ఆనందించు డెల్లరు
దేవుని గురించి కీర్తనలు పాడుచుండుడి
Verse
ఆయన నామ ప్రభావమును - కీర్తించి స్తోత్రించుడి
ఆయనకు ప్రభావము - ఆరోపించి స్తుతించుడి
Verse
నీదు కార్యములు ఎంతో - భీకరమైనట్టివి
నీ బలాతిశయమును బట్టి - శత్రువులు లొంగెదరు
Verse
సర్వలోకమును నీకు - నమస్కరించి పాడును
నీదు నామమును బట్టి - నిన్ను కీర్తించును
Verse
చూడరండి దేవుని - ఆశ్చర్య కార్యములన్
నరుల యెడల చేయు పనుల - వలన భీకరుండహా
Verse
సాగరమును ఎండినట్టి - భూమిగను మార్చెను
జనులు కాలినడక చేత - దాటిరి సముద్రమున్
Verse
ఆయనలో హర్షంచితిమి - నిత్యమేలుచున్నాడు
అన్యజనుల మీద తన - దృష్టి యుంచి యున్నాడు

Related Tags

PraiseWorshipPsalm