Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarvamanava Paapaparihaararthamai Siluvalo Doshivaa Prabhu

సర్వమానవ పాపపరిహారార్థమై సిలువలో దోషివా ప్రభూ

Sarvamanava Paapaparihaararthamai Siluvalo Doshivaa Prabhu

Verse
సర్వమానవ పాపపరిహారార్థమై సిలువలో‖ దోషివా ప్రభూ ‖
సర్వమానవ పాపపరిహారార్థమై
సిలువలో వ్రేలాడిన శ్రీ యేసునాధా‖ 2x ‖
దోషివా…. ప్రభూ…. నువు దోషివా
నీ విధేయతకు నా అవిధేయతకు
మధ్యలో నలిగి, వ్రేలాడిన నిర్దోషివా‖ 2x ‖
దోషివా…. ప్రభూ…. నువు దోషివా
ఘోరంబుగా నే చేసిన నేరాలకు
నువు పొందిన మరణ శిక్ష
నే నడచిన వక్ర మార్గాలకు
నువు పొందిన సిలువ యాతన‖ 2x ‖
కలువరి గిరిలో ఆ ఘోర యాత్ర‖ 2x ‖
నే పొందిన రక్షణా పాత్ర‖ 2x దోషివా ‖
నే వేసిన తప్పటడుగులకు
నీవు కార్చిన రక్త పు మడుగులూ
నే చేసిన కపటంబులకు
నీవు పొందిన కొరడా దెబ్బలు‖ 2x ‖
సంపూర్ణ సిద్ది నొసగితివే నాకు‖ 2x ‖
ప్రేమించితివే నన్ను‖ 2x దోషివా ‖
తులువలలో ఓ తులువగా నున్న
నా పై నీ దయగల చూపు
పరలోకములో నీతో నుండ
భాగ్యంబును నాకు నిచ్చినదే‖ 2x ‖
తుది వరకు నీ దివ్య ప్రేమను పంచ‖ 2x ‖
నీ తుది శ్వాస వీడనంటివే‖ 2x దోషివా ‖

Related Tags

SalvationGood FridaySacrifice