Chorus
సర్వశక్తుఁడ నిర్మలాత్ముఁడ సర్వజనసంరక్షకా మా సర్వపాపముఁ
బరిహరింప నీ సర్వమహిమను విడితివా‖ సర్వ ‖
Verse
నిత్యనాశనమగ్నులగుమా నిత్యశాపముఁ బాపి మరి నీ నిత్య జీవము
మాకునీయను మృత్యు బాధలు పడితివా‖ సర్వ ‖
Verse
పాపమరణపు బంధకములనుఁ దెంపి మము విడిపించుటకు మా
పాపమును భరించి మాకై యాపదల పాల్పడితివా‖ సర్వ ‖
Verse
మెట్టుకీబలు దుష్టులనుచే పట్టి జీవము నిచ్చితివి కా బట్టి యిఁక నీ
కట్టడలలో దిట్టముగ బలపరుచుమీ‖ సర్వ ‖
Verse
సత్యవిధులలో నడువనే న శక్తుఁడనో రక్షకా నీ భృత్యునికి శక్తి నిత్యమిడి
నడి పింపు నీ ఘనసేవలో‖ సర్వ ‖
Verse
నీదు నామము మహిమపరుచను నాదు జీవితకాలమున బహు
సాధు నిగ ననుఁ జేసి సాయము నాధుఁడా నాకీయుమా‖ సర్వ ‖
Verse
ప్రస్తుతము పరదేశినై ప్రచురంబుఁజేతు నీ స్తోత్రముల్ పర వస్తు
ఘనరాజ్యంబుకొరకై వాస్తవముగ నిరీక్షింతున్‖ సర్వ ‖
Verse
ముక్తినుంచి నీవు రాగా శక్తితోఁ ప్రభు యేసువా యా సక్తితో నినుఁ
గూడుకొని బహు యుక్తస్తోత్రముల్ జేతుము‖ సర్వ ‖