Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarvashakthuni Sthothragaanamu

సర్వశక్తుని స్తోత్రగానము

Sarvashakthuni Sthothragaanamu

Verse
సర్వశక్తుని స్తోత్రగానము
సల్పరే జగమెల్లను
నిర్వహించును దాస భారము
నిత్యమెద రాజిల్లను‖ 2x సర్వ ‖
Verse
ముదముతో నిర్మానకుండగు
మూల కర్తను బాడరే
వదన మీక్ష్మాన్వoచి దేవుని
వందనముతో వేడరే‖ 2x సర్వ ‖
Verse
వేదపారాయణము సేయుచు
విశ్వమంత జయింపరే
సాదరముగా దేవు నిక మీ
స్వాoతమున బూజింపరే‖ 2x సర్వ ‖
Verse
ఎదను విశ్రాంతిన్ పరేశుని
హెచ్చుఁగా నుతి జేయరే
సదమలంబగు భక్తితో మీ
సర్వ మాయన కీయరే‖ 2x సర్వ ‖
Verse
చావు పుట్టుక లేనివాడుగ
సంతతము జీవించును
ఈవులిచ్చుచు దన్ను వేడు మ-
హేష్టులను రక్షించును‖ 2x సర్వ ‖
Verse
దాసులై దేవునికి నెదలో
దర్పమును బోగాల్పరే
యేసుక్రీస్తుని పుణ్య వస్త్రము
నే మరక మైదాల్పరే‖ 2x సర్వ ‖

Related Tags

PraiseWorship