Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarvashakthuni Vaakku Yidhiye Sarvamunu Meeve Devuni Sarvamunu Meeve

సర్వశక్తుని వాక్కు యిదియే సర్వమును మీవే దేవుని సర్వమును మీవే

Sarvashakthuni Vaakku Yidhiye Sarvamunu Meeve Devuni Sarvamunu Meeve

Verse
సర్వశక్తుని వాక్కు యిదియే - సర్వమును మీవే
దేవుని సర్వమును మీవే
Verse
పౌలైన కేఫాయైన - అపొల్లోయైన - లోకమైన
ఉన్నవి మరి యేవియైన - సర్వమును మీవేగా
Verse
జీవమైనను మరణమైన - ప్రస్తుతమందున్నవైన
రాబోవునవియైనను - సర్వమును మీవేగా
Verse
దేవుని పనివారైన - దేవుని గృహమైన
దేవుని వ్యవసాయమైన - సర్వమును మీవేగా
Verse
భూమి ఆకాశములందు - అధికార దీవెనలు
సంఘ సంపూర్ణతయును - సర్వమును మీవేగా
Verse
నీరు కట్టిన తోటైన - నీటి యూటలైనను
ఫలములిచ్చు చెట్లయినను - సర్వమును మీవేగా
Verse
అన్ని స్వతంత్రించుకొని - దైవపుత్రులగుటయును
అవసరతల ననుభవింప - సర్వమును మీవేగా
Verse
క్రొత్త సృష్టి స్వాస్థ్యము - పుత్రశ్లాఘ్యమైనను
దేవుని జీవవాక్యము - సర్వమును మీవేగా

Related Tags

Christian LifeScripture