Verse
సర్వశక్తి యుతుడా - సభకు శిరస్సా
కొఱతయెక్కువాయెను - త్వరగా కృపనిమ్ము
Chorus
జీవింపచేయుము నమ్మి ప్రార్థింతుము
వాక్కు నెరవేరువరకు - కాచియుండెదము
Verse
ప్రేమతో పిల్చితివి - నన్ను రక్షించితివి
నీ జీవము నాలో వాడెను - నాదేవా దిగుము
Verse
ప్రేమ చల్లారెనే - ఆత్మ కొఱతచే
శవమువలె నైతిని - నీ చేత నన్నెత్తు
Verse
ప్రార్థన వాంఛయు - వాక్యంబు నాసక్తి
నాలో నూటగా రానిమ్ము - సర్వం సమర్పింతున్
Verse
వైరి చెఱ వీడన్ - పోరుపట్టుదలతో
సల్పి జీవపత్రిక గా - నీచే ప్రకాశింతున్
Verse
ఆత్మ పెండ్లికుమారా - నీరాక కొరకై
నిర్భయముతో వేచియుండ - నానిద్ర పోగొట్టు
Verse
హల్లెలూయ పాడను - మరుపులు తొలగును
శుద్ధాత్మను వెదకును - ఎల్లరకున్ చాటన్