Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarvonna Thudu Sarvaadhikaari Sarvashakthimmthudu Aayanae

సర్వోన్న తుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడు ఆయనే

Sarvonna Thudu Sarvaadhikaari Sarvashakthimmthudu Aayanae

Verse
సర్వోన్న - తుడు సర్వాధికారి
సర్వశక్తిమంతుడు - ఆయనే
సర్వజ్ఞా - నము మనకు
నిచ్చున్ - పాడుడల్లెలూయ
Verse
యధార్థమైనది - దైవమార్గ
మిల - సంపూర్ణమైనది
నాథుడేసు నీకై - చేయుచున్నది
ఇప్పుడు నీకు తెలియదు
మననాథు డమర్త్యుని మాటనమ్ము
మిక - మీదట తెలిసి కొందువు
Verse
ఆశ్చర్యకరుడు యోసేపున్ నెట్టి
తెచ్చె నైగుప్తునకు - రాజుగా
చేసి తన ప్రజల అక్కరన్ తీర్చె
పాడు డల్లెలూయ
Verse
ఆలోచనకర్త మోషేను లేపె
పాలకుడైన ఫరో నెదిరింపన్
బలపరచి తన ప్రజలన్ విడిపించె
పాడు డల్లెలూయ
Verse
మహోన్నతుడు దానియేలున్ గాచె
మహాబాబెలునందు ఆయనే
మహారాజుగా మహిమ నొందెను
పాడు డల్లెలూయ
Verse
బలవంతుడేసు పేతురున్ గాచి
పౌలును బట్టి తెచ్చి సంఘమున్
కల్తీలేకుండ కట్టె సత్యాత్మతో
పాడు డల్లెలూయ
Verse
ఆది అంతము లేని మన యేసు
నాథుడు వచ్చుచున్నా డిదిగో
సిద్ధముగా నుండి సుస్వాగత మిమ్ము
ఆమెన్ హల్లెలూయా

Related Tags

PraiseWorshipGod