Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarvonnatha

సర్వోన్నత

Sarvonnatha

Lyricist: Daniel Pammi
Verse
సర్వోన్నత స్థలములలో సమాధానము
ప్రాప్తించె ప్రజ కొరకు ప్రభు జన్మముతోను‖ 2x ‖
హల్లెలూయా అర్పణలు – ఉల్లముతో చెల్లింతుమ్
రాజాధి రాజునకు – హోసన్నా ప్రభువునకు‖ 2x సర్వోన్నత ‖
Verse
పశువుల పాకలో మనకు శిశువు జన్మించె
పొత్తిగుడ్డలలో చుట్టగ పవళించిన తండ్రి‖ 2x ‖
ఆశ్చర్యకరుడు – ఆలోచనకర్త‖ 2x ‖
నిత్యుండు సత్యుండు నిజ రక్షణ క్రీస్తు‖ 2x హల్లెలూయా ‖
Verse
మన వ్యసనములను బాప మొత్తబడుట కొరకై
మన సమాధానార్థ శిక్ష మోపబడుట కొరకై‖ 2x ‖
మన దోషము బాప – మానవరూపమున‖ 2x ‖
జనియించె బాలుండు ఇమ్మానుయేలుండు‖ 2x హల్లెలూయా ‖

Related Tags

PraiseWorshipChristmas