Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarvonnathamaina Sthalamulalo Devuniki Mahimayu

సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు

Sarvonnathamaina Sthalamulalo Devuniki Mahimayu

Lyricist: Freddy Paul
Verse
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు
ఆయనకు ఇష్టులైన ప్రజలకు భూమిమీద
సమాధానము కలుగును గాక
హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా
ఆది దేవుడవతరించెను ఈ అవనిలో ఆది దేవుడవతరించెను
అఖిల లోక రక్షకుడై రారాజు యేసు జన్మించెను
నిత్యుడగు తండ్రి ఆయనే ఆశ్చర్యకరుడు ఆయనే
సమాధాన ప్రభువు ఆయనే సర్వలోక నాధుడాయనే
సర్వసృష్టికర్త ఆయనే సత్రములో స్థలము లేదాయనే
ధీనాతిధీనుడాయనే ధీనులను దీవించు ఆయనే
రాజులకు రాజు ఆయనే ప్రభువులకు ప్రభువు ఆయనే
మొదటివాడు ఆయనే కడపటివాడు ఆయనే
యెష్షయి మొద్దు ఆయనే దావీదు చిగురు ఆయనే
స్త్రీ సంతానమాయనే నజరేయుడు ఆయనే
అద్వీతీయ కుమారుడాయనే నిత్యజీవమాయనే
మూలరాయి ఆయనే సీయోను శిఖరమాయనే

Related Tags

PraiseWorshipChristmas