Chorus
సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము‖ 2x ‖
ఎవ్వరులేరు - నాకు ఇలలో‖ 2x ‖
ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా‖ 2x ‖
Verse
నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో‖ 2x ‖
వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు‖ 2x సర్వో ‖
Verse
నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు‖ 2x ‖
సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు‖ 2x సర్వో ‖
Verse
నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు‖ 2x ‖
విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు‖ 2x సర్వో ‖