Verse
సర్వోన్నతుడా సర్వాధికారి ఆకాశం నీ సింహాసనం
సర్వోన్నతుడా సర్వాధికారి ఈ భూమి నీ పాద పీఠము‖ 2x ‖
సర్వోన్నతుడా... సర్వాధికారి...
ప్రేమామయుడా... నా యేసయ్యా...
సర్వోన్నతుడా... సర్వాధికారి...
కరుణామయుడా ... నా యేసయ్యా...‖ 2x సర్వోన్నతుడా ‖
Verse
నీ వాక్యమును బట్టి నా అడుగులు తిరపరచుము
ఏ పాపమును నన్ను ఎలనీయకుము‖ 2x ‖
అపవాది తంత్రములను తెలుసుకొనుటకు నాకు
నీ జ్ఞానమును దయచేయుము‖ 2x సర్వోన్నతుడా ‖
Verse
నే పాడు ప్రతి పాట నీ కొరకే పాడెదన్
నే వేసే ప్రతి అడుగు నీ మార్గంలోనే వేసెదన్‖ 2x ‖
పదితంతుల సితారతోను తంబూరనాధముతోను
నిన్నే నే కీర్తించెదన్‖ 2x సర్వోన్నతుడా ‖