Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarvonnathuda Vijayaveeruda

సర్వోన్నతుడ విజయవీరుడ

Sarvonnathuda Vijayaveeruda

Lyricist: Pastor A Moses
Verse
సర్వోన్నతుడ! విజయవీరుడ
ప్రియుడ నా శిల్పకారుడ
ఎవ్వరు లేరు నాకు యేసయ్యా
నీ సన్నిది చాలు నాకు మేసయ్యా
Pre-Chorus
అ.ప: ఇంతకంటె భాగ్యమంటయ్యా‖ అ.ప ‖
నాకు నీకంటె ఘనులెవరయ్యా
Verse
గడచిన కాలంలో కనురెప్పలా
నీ చాటున దాచిన నా గొప్ప కాపరి
వేల్పులలో నీవు మహనీయుడవు
నన్నెన్నడు యెడబాయని తండ్రివినీవే‖ నా తండ్రివి నీవే ‖
Verse
దయగలదేవుడవీ ధరణీయందున
వ్యర్ధుడు చెరపలేడు నా క్షేమమును
నే గాడాంధకారపు లోయలో నడిచినను
నీ దుడ్డు కర్ర ధండము ఆధరించునే నన్నాదరించునే
Verse
రాబోవు శ్రేష్ఠమైన రాజ్యము కొరకు
వెనుదీయక గురి యొద్దకు సాగివెళ్ళదన్
నిర్జీవ గడియలు నిలదీసినగాని
నా మనస్సు నీపైనే ఆనుకొందునే‖ నే నను కొందునే ‖
Verse
విమర్శలకు కృంగను నా హృదయమందున
నా స్థితిని మార్చేస్తుతి పాత్రుడుండంగ
పునరుద్ధానుడ నా పితరులదేవా
జయమునిచ్చు క్షేత్రములో యాత్ర చేసెదన్‖ నే యాత్ర చేసిదన్ ‖

Related Tags

PraiseWorshipGod