Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarvonnathudaa

సర్వోన్నతుడా

Sarvonnathudaa

Lyricist: Hosanna Ministries
Verse
సర్వోన్నతుడా
నీవే నాకు ఆశ్రయదుర్గము‖ 2x ‖
ఎవ్వరు లేరు – నాకు ఇలలో‖ 2x ‖
ఆదరణ నీవేగా -ఆనందం నీవేగా‖ 2x ‖
Verse
నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట
నిలువలేరని యెహోషువాతో‖ 2x ‖
వాగ్దానము చేసినావు
వాగ్దాన భూమిలో చేర్చినావు‖ 2x సర్వోన్నతుడా ‖
Verse
నిందలపాలై నిత్య నిబంధన
నీతో చేసిన దానియేలుకు‖ 2x ‖
సింహాసనమిచ్చినావు
సింహాల నోళ్లను మూసినావు‖ 2x సర్వోన్నతుడా ‖
Verse
నీతి కిరీటం దర్శనముగా
దర్శించిన పరిశుద్ధ పౌలుకు‖ 2x ‖
విశ్వాసము కాచినావు
జయజీవితము ఇచ్చినావు‖ 2x సర్వోన్నతుడా ‖

Related Tags

PraiseWorshipComfort