Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sarvonnatuni Chaatuna Nivasinchedi Vaade

సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే

Sarvonnatuni Chaatuna Nivasinchedi Vaade

Verse
సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే
సర్వశక్తుని నీడను విశ్రమించును పరమ ధన్యత యిదియే
Chorus
తన రెక్కల క్రింద ఆశ్రయము - తన రెక్కలతో కప్పును
Verse
ఆయనే నా ఆశ్రయము - నా కోటయు దుర్గమును
ఆయన సత్యము నా కేడెమును నేనమ్ముకొను దేవుడు
Verse
పగటి బాణమున కైనా రాత్రి భయమున కైనా
చీకటిలో తిరిగు తెగులుకైనా నేనేమి భయపడను
Verse
వేయి పదివేలు కుడిప్రక్కను కూలినను
దయచూపు దేవుడు నీకుండ అపాయము రాదు
Verse
నీ ప్రభువాశ్రయమే యెహోవా నివాసం
అపాయము తెగులు - నీ గుడారము సమీపించవు
Verse
నీదు మార్గంబులలో - నిన్ను దూతలు కాయున్
పాదములకు రాయి తగులకుండ నిన్నెత్తికొందురు
Verse
కొదమ సింహముల నాగుపాముల నణచెదవు
అతడు నా నామము నెరిగెను అతని తప్పించెదను
Verse
అతడు నను ప్రేమించెన్ - నామమున మొఱ్ఱపెట్టెన్
అతని విడిపించి ఘనపరతున్ అతని కుత్తరమిత్తున్

Related Tags

PsalmProtectionRefuge