Verse
సర్వేశ్వరుని దర్శనముకై
ఉదయమునే మ్రొక్కి వేచిఉంటిని
ప్రాణేశ్వర నా ప్రాణ ప్రియుడా
నీ మహిమతో నన్ను దర్శించుమా
సర్వేశ్వరా నా ఆత్మ రక్షకా
నీ దివ్య స్వరముతో మట్లాడుమా
Verse
పరమాత్ముడా లోక పరిపాలకా
ఘన మహిమ గలవాడా, గణనీయుడా
సర్వాంతర్యామివి నీవే యెహోవా
సర్వాధికారివి జనయత దైవమా
Verse
రాజాధి రాజా మా రక్షణ శృంగమా
రమణీయ సామ్రాజ్య పరిపాలకా
ప్రేమించే క్షమదాత నీవేనయ్యా
ప్రార్ధనలు ఆలించే మా యేసుయ్య
Verse
ఆల్ఫా ఒమేగా ఆది అనంతుడా
ఆదరణ కర్త అదృశ్యదైవమా
సత్యస్వరూపివి నీవేనయ్యా
ఆత్మాభిషేకముతో నింపుమా