Verse
శాశ్వతమైన ప్రేమకు పాత్రుని చేసి
నిత్యుడవగు తండ్రి నీవైనావే
రక్షణ ఆనందాన్ని నా కందించి
పరలోకపు వారసుడ్ని చేసావే
Verse
నా అడుగులను క్రమపరచి నా హృదయమును స్ధిరపరచి
నీదు రక్తములో నను శుద్ధుని చేసితివే
నను నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నను మలచి
నీ దీవెన కర్హుడుగా చేసిన దేవా నీకే స్తోత్రము
Verse
నీ వాక్యం నా యందుంచి దుష్టుడిని జయింపచేసి
సత్యమైన వెలుగులోనికి నడిపించితివే
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని
నీ సాక్షిగా సంపూర్ణ శక్తితో దేవా నన్ను నిలుపు