Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Saswatha Krupanu Nenu Thalanchaga

శాశ్వత కృపను నేను తలంచగా

Saswatha Krupanu Nenu Thalanchaga

Lyricist: Bro Yesanna
Chorus
శాశ్వత కృపను నేను తలంచగా
కానుకనైతిని నీ సన్నిధిలో - కానుకనైతిని నీ సన్నిధిలో
శాశ్వత కృపను నేను తలంచగా
Verse
నా హృదయమెంతో - జీవము గల దేవుని
దర్శించ ఆనందముతో కేకలేయుచున్నది‖ 2x ‖
నా దేహమెంతో నీకై ఆశించే -2 ॥ శాశ్వత ॥‖ 2x శాశ్వత ‖
Verse
భక్తిహీనులతో - నివసించుట కంటెను
నీ మందిరావరాణములో ఒక్కదినము గడుపుట‖ 2x ‖
వేయిదినాల కంటే శ్రేష్ఠమైనది -2 ॥ శాశ్వత ॥‖ 2x శాశ్వత ‖
Verse
సీయోను శిఖరాన - సిలువ సితారతో
సింహాసనం ఎదుట క్రొత్తపాట పాడెద‖ 2x ‖
సీయోను రారాజువు నీవెగా -2 ॥ శాశ్వత ॥‖ 2x శాశ్వత ‖

Related Tags

WorshipDevotionalGrace