Verse
శాశ్వతమైనది ఎన్నడు మారనిది
నీ ప్రేమ యేసయ్య నా జీవితాన
స్వార్థము లేనిది పరిశుద్ధమైనది ఎన్నడు మారనిది
నీ ప్రేమ యేసయ్య నా జీవితాన
ప్రాణాన్ని దారపోసి పాపాన్ని క్షమియించి
శాపాన్ని పారత్రోలి నన్ను శుద్ధి చేశావు
నీ ప్రేమే శాశ్వతమయ్యా
దేవా నీకే స్తుతి స్తోత్రము
నా దేవా నీకే స్తుతి స్తోత్రము
Verse
దినమెళ్ల ఆశలు కలిగించు నా హృదిని
యదార్ధమైన త్రోవలయందు నడిపించుటకు
నీ సత్య వాక్యమును నీ ఆజ్ఞల మార్గమును
నాకిచ్చినావు శాశ్వత ప్రేమతో
నీ నిత్య రాజ్యముకు నన్ను సిద్ధపరచుటకు
పరిశుద్ధ జీవితాన్ని జీవింప చేయుటకు
ఆదరణ కర్త అయిన పరిశుద్ధాత్ముని
నాకిచ్చినవు శాశ్వత ప్రేమతో