Chorus
శాశ్వాతామైనదీ - నీవు నా యెడ చూపినా కృప
అనుక్షణం నను కనుపాపవలె కాచినా కృప‖ 2x ‖
Verse
నీకు బహుదూరమైన నన్ను - చేరదీసిన‖ 2x ‖
నా తండ్రివి - నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో
Verse
తల్లి తన బిడ్డలను మరిచినా - నేను మరువలేనంటివే‖ 2x ‖
నీదు ముఖ కాంతియే - నన్ను ఆదరించెనులే
Verse
తట్టుడి మీకు తెరిచేదను - వెదకు వారికి దొరికెదను‖ 2x ‖
అడుగు ప్రతి వానికి ఆత్మను - ఇచ్చెద నంటివే
Verse
పర్వతములు తొలగినను - మెట్టలు తత్తరిల్లిన‖ 2x ‖
నా కృప నిన్ను వీడదని - అభయమీచ్చితివే