Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sathuvabhoomilo Sreshtamaina Drakshatheegalanu Naatinchina Devudu

సత్తువభూమిలో శ్రేష్టమైన ద్రాక్షతీగలను నాటించిన దేవుడు

Sathuvabhoomilo Sreshtamaina Drakshatheegalanu Naatinchina Devudu

Verse 1
సత్తువభూమిలో శ్రేష్టమైన ద్రాక్షతీగలను నాటించిన దేవుడు, నీవు ఫలిస్తే సంతోషిస్తాడు..
Verse
ఫలములనాసించిన పరలోకతండ్రి - తేరిచూచుచున్నాడు నీ వైపు‖ 2x ‖
ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలి - పరిక్షించుచున్నాడు నీ కాపు‖ 2x ‖
ఫలియించకుండుట నీకు న్యాయమా - యజమాని సహనముతో చెలగాటమా..?‖ 2x ‖
Verse
ఐగుప్తునుండి పెరికి తెచ్చినాడు - సంఘద్రాక్షతోటలో నిన్ను నాటినాడు‖ 2x ‖
చుట్టు త్రవ్వి ఎరువు వేసి - నీరుపోసినాడు‖ 2x ‖
తన స్వాస్థ్యముగా నిను - ప్రత్యేకపరచినాడు‖ 2x ‖
ఫలియించకుండుట నీకు న్యాయమా - యజమాని సహనముతో చెలగాటమా..?‖ 2x ‖
Verse
వెదకినపుడు నీ యొద్ద ఫలములేకయుంటే - ఆకులతో నిను చూసి తండ్రి సంతసించునా‖ 2x ‖
ఇవ్వబడిన సమయములో - వర్ధిల్లకుంటే‖ 2x ‖
మోడులాంటి నిన్ను ఇంక - నరికివేయకుండునా‖ 2x ‖
ఫలియించకుండుట నీకు న్యాయమా - యజమాని సహనముతో చెలగాటమా..?‖ 2x ‖

Related Tags

DevotionGodFruitfulness