Chorus
సత్యమునకు మేం సాక్షులము క్రీస్తుకు మేము సాక్షులము
రోషముగల దేవుని ప్రజలం సత్యము కలిగి జీవిస్తాం
రోషముగల దేవుని ప్రజలం సత్యము కొరకు మరణిస్తాం
హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా
హోసన్నా. . హోసన్నా. . హోసన్నా. .
Verse
ఉమ్ములూసినా మొఖము త్రిప్పము
ముళ్ళు గ్రుచ్చినా తలను వొంచము
కొరడ విసిరినా వెనుక తిరుగము
బల్లెము పొడిచినా భయపడము
సత్యము కలిగి జీవిస్తాం
సత్యము కొరకు మరణిస్తాం
Verse
మాకు మేము తగ్గించుకొంటాం
మోకాళ్ళ కన్నీళ్ళ ప్రార్ధన చేస్తాం
సిలువ సంకెళ్ళ సమర్పణ చేస్తాం
దేవుని రాజ్యము రగిలిస్తాం
సత్యము కలిగి జీవిస్తాం
సత్యము కొరకు మరణిస్తాం