Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Seethakaalamlo Sri Yesuni Subhavaartha

శీతకాలంలో శ్రీ యేసుని శుభవార్త

Seethakaalamlo Sri Yesuni Subhavaartha

Lyricist: Jd Cyril Babu
Verse
శీతకాలంలో శ్రీ యేసుని శుభవార్త
మహిమ స్వరూపుడు మానవ రూపిగా
మరియకు సుతుడయ్యే నేడు
లోకానికి రక్షకుడుదయించే
ఓ ఓ ఓ ఓ
ప్రతి గొంతు జో లాలి పాడే
మనసులే ఉరకలేసిన వేళ
మధుర తలపు సుధలే
Verse
పరము నుండి వచ్చినాడు మనలను రక్షించుటకు
వేగిరపడుదామా ఓ సర్వ జనాంగమా
నిజ రక్షకుని ఆరాధిస్తూ దీవెనలే పొందుదాం
మదిలో యేసుని జన్మను తలచిన మనమే ధన్యులము
లోకానికి రక్షకుడుదయించే
ఓ ఓ ఓ ఓ
శోకాలను తీర్చును ఈనాడే
మనసులే ఉరకలేసిన వేళ
మధుర తలపు సుధలే
Verse
సంఘ సహవాసము కలిసి సువార్తకెల్లొద్దాం
బంధు మిత్రులంతా కలిసి ఆలయానికెల్లొద్దాం
కానుకలు అర్పిద్దాం మనసార ప్రార్ధిద్దాం
మదిలో యేసుని స్మరనే నిత్యం
అదియే ఆశీర్వాదం
నీతి సూర్యుడుదయించేనండి
ఓ ఓ ఓ ఓ
నిజ క్రిస్మస్ పండుగ సందడి
మనసులే ఉరకలేసిన వేళ
మధుర తలపు సుధలే

Related Tags

ChristmasNativityCelebration