Verse
సీయోను పాటలు సంతోషముగా
పాడుచు సీయోను వెల్లుదము‖ 2x ‖
Verse
లోకాన శాశ్వతానందమేమియు
లేదని చెప్పెను ప్రియుడేసు‖ 2x ‖
పొందవలె నీ లోకమునందు
కొంతకాలమెన్నో శ్రమలు‖ 2x సీయోను ‖
Verse
ఐగుప్తును విడచినట్టి మీరు
అరణ్యవాసులే ఈ ధరలో‖ 2x ‖
నిత్యనివాసము లేదిలలోన
నేత్రాలు కానానుపై నిల్పుడి‖ 2x సీయోను ‖
Verse
మారాను పోలిన చేదైన స్థలముల
ద్వారా పోవలసియున్ననేమి‖ 2x ‖
నీ రక్షకుండగు యేసే నడుపును
మారని తనదు మాట నమ్ము‖ 2x సీయోను ‖
Verse
ఐగుప్తు ఆశలనన్నియు విడిచి
రంగుగ యేసుని వెంబడించి‖ 2x ‖
పాడైన కోరహు పాపంబుమాని
విధేయులై విరాజిల్లుడి‖ 2x సీయోను ‖
Verse
ఆనందమయ పరలోకంబు మనది
అక్కడనుండి వచ్చునేసు‖ 2x ‖
సీయోను గీతము సొంపుగ కలసి
పాడెదము ప్రభుయేసుకు జై‖ 2x సీయోను ‖