Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Seeyonu Paatalu Santhoshamugaa

సీయోను పాటలు సంతోషముగా

Seeyonu Paatalu Santhoshamugaa

Verse
సీయోను పాటలు సంతోషముగా
పాడుచు సీయోను వెల్లుదము
Verse
లోకాన శాశ్వతానందమేమియు
లేదని చెప్పెను ప్రియుడేసు
పొందవలె నీ లోకమునందు
కొంతకాలమెన్నో శ్రమలు‖ సీయోను ‖
Verse
ఐగుప్తును విడచినట్టి మీరు
అరణ్యవాసులే ఈ ధరలో
నిత్యనివాసము లేదిలలోన
నేత్రాలు కానానుపై నిల్పుడి‖ సీయోను ‖
Verse
మారాను పోలిన చేదైన స్థలముల
ద్వారా పోవలసియున్ననేమి
నీ రక్షకుండగు యేసే నడుపును
మారని తనదు మాట నమ్ము‖ సీయోను ‖
Verse
ఐగుప్తు ఆశలనన్నియు విడిచి
రంగుగ యేసుని వెంబడించి
పాడైన కోరహు పాపంబుమాని
విధేయులై విరాజిల్లుడి‖ సీయోను ‖
Verse
ఆనందమయ పరలోకంబు మనది
అక్కడనుండి వచ్చునేసు
సీయోను గీతము సొంపుగ కలసి
పాడెదము ప్రభుయేసుకు జై‖ సీయోను ‖

Related Tags

PraisePilgrimageHeaven