Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Seeyonu Puramaa Sarvoannathuni Shrumgaarapuramaa Seeyoanupuramaa

సీయోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సీయోనుపురమా

Seeyonu Puramaa Sarvoannathuni Shrumgaarapuramaa Seeyoanupuramaa

Chorus
సీయోను పురమా - సర్వోన్నతుని
శృంగారపురమా - సీయోనుపురమా
Pre-Chorus
శాశ్వతముగ దైవ - సంకల్పంబైతివి
స్వర్ణాలంకార సీయోను
సతతము నీదే యనుభవ భాగ్యము
Verse
షాలేము రాజు సంతోషముగా - సంధించెను నిన్ను
షాలేమురాజు అర్పించెను నీలో
అబ్రాహాం కొమరుని - స్వర్ణాలంకార సీయోను
దావీదు పట్టణమనబడెడు
Verse
ఉత్తర దిక్కున - ఎత్తయిన -శృంగార నగరమా
ఉత్తర దిక్కున సర్వభూమికి
సంతసమిడుచున్నావు స్వర్ణాలంకార సీయోను
రమ్యముగా రంజిల్లు నగరమా
Verse
నీ నగరులయందు - నివసించుచున్నాడు - నీ ప్రభువు
నీ నగరులయందు రాజులు కూడిరి
నీ తేజము జూచిరి - స్వర్ణాలంకార సీయోను
భ్రమపడి త్వరగా - పరుగిడిపోయిరి
Verse
నిత్యుండగు తండ్రి - నీ నిర్మాణకుడు - శిల్పియు తానె
నిత్యుండగు తండ్రి ప్రభుయేసే నిన్ను
పరిణయమాడను కోరెన్ - స్వర్ణాలంకార సీయోను
వైవాహికానందము నీదే
Verse
రక్షణ వార్తలు - రమ్యముగా - నీలో వినబడుచున్నవి
రక్షణ వార్తలు జనులెల్ల నీలో
జన్మించెనందురు స్వర్ణాలంకార సీయోను
జనముల తల్లియని నిన్నందురు
Verse
నిండియున్నవి - నీలో దైవోద్దేశము - లెన్నెన్నో
నిండియున్నవి ఘన కార్యము లెన్నో
గొప్పగ జరిగెను నీలో - స్వర్ణాలంకార సీయోను
విభవమును వివరింపగ లేము
Verse
సొంపుగ పాడుడి - సంతసముగ - సీయోను పాటలను
సొంపుగ పాడుడి యేసునకే మహిమ
భాసురముగ చెల్లించి - స్వర్ణాలంకార సీయోను
హల్లెలూయా - యేసుప్రభునకే

Related Tags

PraiseWorshipZion