Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Seeyonu Vaasulaara Sakala Vaagdaanamulu Manavaayenu

సీయోను వాసులారా సకల వాగ్దానములు మనవాయెను

Seeyonu Vaasulaara Sakala Vaagdaanamulu Manavaayenu

Chorus
సీయోను వాసులారా
Chorus
సకల వాగ్దానములు మనవాయెను
సాగిలపడి యేసుని ఆరాధించెదము
Verse
దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో
దాని నివాసులుగా మనలను దీవించెన్
Verse
సంతోషించుము దేశమ భయపడవలదు
గంతులు వేయుము ఘనకార్యములను చేయున్
Verse
పచ్చిక మొలచును ఫలియించును మరి తరులు
ఫలియించును ద్రాక్ష అంజూరపు చెట్లు
Verse
తొలకరి కడవరి వర్షము విస్తారముగా
తనదు నీతిని బట్టి మనకొసగును
Verse
కొట్లు ధాన్యముతో నిండి పొర్లును
క్రొత్త తైలము ద్రాక్షరసము పారును
Verse
పసరు గొంగలి చీడపురుగులు మిడుతల్
నాశనముచేసిన పంటను మీకొసగును
Verse
సర్వ శరీరులపై తన ఆత్మను పోసి
స్వప్నముల దర్శనముల మీ కొసగును
Verse
సీయోను వాసులు సిగ్గునొందరు
శేషము నిలిచి వాసము చేతురు ప్రభులో
Verse
ఆ దినమున యెహోవా నామమునందు
ప్రార్థించు వారు రక్షణ నొందెదరు

Related Tags

WorshipZionPromise