Chorus
సీయోనుకన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్ పాయక నీ రాజు
భారవాహక మెక్కి బాలస్తోత్రములతో బైలుదేరి వచ్చె‖ సీయోను ‖
Verse
హెబ్రాయిలోను నీ రాజు పేరు యూదులరాజు హెబ్రీయ జనులను
అబ్రాము కొడుకులను విభవదేశము జేర్చు శుభరాజు యీతండే‖ సీయోను ‖
Verse
హెల్లేనీలోను నీ రాజు పేరు యూదులరాజే యెల్లపాపులఁ బ్రోచు
తాల్మిరక్షకుఁడితఁడు చల్లని ప్రభువని గొల్గొత మ్రోగెను‖ సీయోను ‖
Verse
ఉర్వి రోమాలో నీ రాజు పేరు యూదులరాజే సర్వరాష్ట్రికులకు
బూర్వపితరులతోను వరసింహాసన మిచ్చు వరదేశాధిపుఁ డితఁడు‖ సీయోను ‖
Verse
వాసిగ హెబ్రీ హెల్లేనీలో రోమాయిలోను హోసన్నా ప్రభుని
పేరట వచ్చు మెస్సీయ్యదావీదు కొడుకా శ్రీశుభములు‖ సీయోను ‖