Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Seeyonuku Thirigi Cheralo Nundi Vidipinchi Yehova Rappinchinappudu

సీయోనుకు తిరిగి చెరలో నుండి విడిపించి యెహోవా రప్పించినప్పుడు

Seeyonuku Thirigi Cheralo Nundi Vidipinchi Yehova Rappinchinappudu

Chorus
సీయోనుకు తిరిగి చెరలో నుండి విడిపించి
యెహోవా రప్పించినప్పుడు ఆ - ఆ‖ 2x ‖
మనము కలకన్న వారివలె నుంటిమి
నోటి నిండ నవ్వుండెను ఆ - ఆ‖ 2x ‖
Verse
యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని
అన్యజనులు చెప్పుకొనిరి
సంతోషభరితులమైతిమి ఆ - ఆ‖ 2x ‖
Verse
దక్షిణ దేశమునందు ప్రవాహములు పారునట్లు
యెహోవా చెరపట్టబడిన
మా వారిని రప్పించుము ఆ - ఆ
Verse
కన్నీటితో పిడికెడు - విత్తనములు విత్తువారు
సంతోషగానముతో పంటను
యుక్తకాలమున కోసెదరు ఆ - ఆ

Related Tags

PsalmJoyRestoration