Verse
సీయోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినపుడు
మనము కలలను కనిన వారివలె నుంటిమిగా
Verse
అప్పుడు నోటి నిండ నవ్వుండెనుగా మనకు
అందుకే మన నాలుక ఆనంద గానముతో నిండె
Verse
యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు జేసె
అన్య జనులెల్లరు చెప్పుకొనుచుండిరిగా
Verse
ఘనకార్యంబులను యెన్నో యెహోవా చేసె మనకు
మన మందరము యెంతో ఆనందభరితులమైతిమి
Verse
దక్షిణ దేశములో నదులు పారునట్లుగా
దయతో చెరలో నున్న మా జనులను రక్షించుము ప్రభువా
Verse
పిడికెడు విత్తనములు పట్టుకొని పోవువాడు
పంటను కోయును ముదముగ కన్నీటితో విత్తువాడు
Verse
ఎన్నో ప్రయాసములతో సమకూర్చును పంటంతటిని
సంతోష గానము చేయుచు పనల మోసికొని వచ్చును