Verse
సీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై‖ 2x ‖
సమాధానమై – సదాకాలము నను నీతో
నడిపించుచున్నావు నీ కీర్తికై
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా‖ 2x ‖
Verse
నిర్దోషమైన మార్గములో – నా అంతరంగమున ధైర్యమునిచ్చి‖ 2x ‖
నీ సన్నిధిలో నను నిలిపి – ఉన్నత విజయమునిచ్చితివి‖ 2x ‖
నీ ఆశలు నెరవేరుటకు – నీ చిత్తము జరిగించుటకు
విడువవు నను యెడబాయవు
నీవు విడువవు నను యెడబాయవు‖ సీయోనులో ‖
Verse
నాయందు దృష్టి నిలిపి – నీ స్నేహబంధముతో ఆకర్షించి‖ 2x ‖
కృపావరములతో నను నింపి – సత్యసాక్షిగా మార్చితివి‖ 2x ‖
నీ మనస్సును పొందుకొని – నీ ప్రేమను నింపుకొని
కీర్తిoచెదను ప్రతినిత్యం
నిను ఆరాధింతును అనుక్షణము‖ సీయోనులో ‖
Verse
నీ దివ్యమైన మహిమను – పరలోకమందునే చూచెదను‖ 2x ‖
నీ కౌగిలిలో చేర్చుకొని – ప్రతి భాష్పబిందువును తుడిచెదవు‖ 2x ‖
నీ మాటల మకరందమును – మరపురాని అనుబంధమును
మరువను ఎన్నడు విడువను
నేను మరువను ఎన్నడు విడువను‖ సీయోనులో ‖