Verse
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే
Verse
సీయోనులో స్థిరమైన పునాది నీవు
నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను‖ 2x ‖
Verse
సూర్యుడు లేని చంద్రుడు లేని
చీకటి రాత్రులు లేనే లేని‖ 2x ‖
ఆ దివ్య నగరిలో కాంతులను
విరజిమ్మెదవా నా యేసయ్యా‖ 2x సీయోనులో ‖
Verse
కడలి లేని కడగండ్లు లేని
కల్లోల స్థితి గతులు దరికే రాని‖ 2x ‖
సువర్ణ వీధులలో
నడిపించెదవా నా యేసయ్యా‖ 2x సీయోనులో ‖
Verse
సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము‖ 2x ‖
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును‖ 2x ‖
నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే‖ 3x ‖
ఆనందమే పరమానందమే‖ 10x ‖