Verse 1
Reference: సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి జెకర్యా Zechariah 9:9
Verse
సీయోనుపట్టణమా - సువర్ణ నగరమా
మహిమాపురమా - మహా భాగ్యము నీదే
రమ్యమైనట్టిరా - రాజుపురమా
Verse
సీయోను సుందరులు - సువర్ణ సములు
వన్నెపగడాల ఛాయ - కన్న గొప్పది
కాంతి నీలములకన్న - మంచిది
Verse
ప్రభువే నిన్ను కోరి - ప్రేమించినాడు
సర్వోన్నతుడే నిన్ను - స్థిరము జేసెను
నిత్యనివాసముగ - నిను జేసెను
Verse
తన చంటిపిల్లను - తల్లి మరచునా
మరచినగాని నేను - మరువను నిన్ను
చెక్కితిని నిను నా యర - చేతుల మీద
Verse
భయమేల సీయోను - బలమొందిలెమ్ము
సంతసమున పాట సాహా - సమున పాడుడీ
వసియించు నీ ప్రభువు వచ్చి నీలో
Verse
పెండ్లి కుమారుడు - పెండ్లి కూతురును
చూచునట్లు నిన్ను - చూచి దేవుడు
సీయోను నీయందు - సంతస మొందున్
Verse
సీయోను పగవారు - సిగ్గునొందెదరు
నిన్ను భాదించినట్టి - నీ పగవారు
పరుగున నీ పాదముల - పై బడెదరు
Verse
సీయోను నీ నీతి - సూర్య కాంతివలె
రయమున యేసు నీదు - రక్షణజ్యోతి
వెలిగించువరకు - విశ్రమించడు