Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Seeyonuraaju Vachchunu Madhin Sidhdhapadu

సీయోనురాజు వచ్చును మదిన్ సిద్ధపడు

Seeyonuraaju Vachchunu Madhin Sidhdhapadu

Verse
సీయోనురాజు వచ్చును మదిన్ సిద్ధపడు
మీ తనువుల్ శుద్ధిచేయుడి మీ రాజుకొరకే
Verse
లోకస్తులు ప్రశ్నింతురు మరి మీ రాజు యెవరని
తన శక్తిని విన్నవారు చూడ నాశింతురుగా
క్రీస్తే మన రారాజని ఉత్సహించెదము
Verse
వాహనములు ఎన్నియున్న గార్ధభమును యెక్కెను
తా నెవరియింట నుండునో వారిని యుద్ధరించును
పరీక్షించ ఆయనను చేర్చుకో నీయందు
Verse
యేసుని స్వీకరించెడు వారేగుదు రాయనతో
తృణీకరించువారలు నశింతురు నిక్కంబుగ
ప్రాముఖ్యమౌ ప్రశ్నయిది యోచించి చూచుకో
Verse
రాజుల రాజు ఆయనే ప్రభుల ప్రభువాయనే
న్యాయవంతుడు ఆయనే మహాత్ముడైన దేవుడు
సదా రాజ్యంబాయనదే ఆనంద మొందుడి

Related Tags

WorshipSecond ComingJesus Christ