Chorus
శాశ్వతమైనదీ నీతో నాకున్న అనుబంధము
మరువలేనదీ నాపై నీకున్న అనురాగము‖ 2x ‖
యేసయ్యా నీ నామ స్మరణయే
నీ శ్వాస నిశ్వాసవాయెను‖ 2x శాశ్వత ‖
Verse
సంధ్యారాగము వినిపించినావు
నా హృదయ వీణను సవరించినావు‖ 2x ‖
నా చీకటి బ్రతుకును వెలిగించినావు‖ 2x ‖
నా నోట మృదువైన మాటలు పలికించినావు‖ శాశ్వత ‖
Verse
నా విలాప రాగాలు నీవు విన్నావు
వేకువ చుక్కవై దర్శించినావు
అపవాది ఉరుల నుండి విడిపించినావు‖ 2x ‖
శత్రువులను మిత్రులుగా నీవు మార్చియున్నావు‖ శాశ్వత ‖