Chorus
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె కాచిన కృప
Verse
నీకు బహుదూరమైన నన్ను చేర దీసిన నా తండ్రివి
నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో‖ శాశ్వత ‖
Verse
తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే
నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే‖ శాశ్వత ‖
Verse
పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన
నా కృప నిను వీడదని అభయమిచ్చితివే‖ శాశ్వత ‖