Verse
శాశ్వత కృపను నేను తలంచగా
కానుకనైతిని నీ సన్నిధిలో‖ 2x శాశ్వత ‖
Verse
నా హృదయమెంతో జీవముగల దేవుని
దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది‖ 2x ‖
నా దేహమెంతో నీకై ఆశించే‖ 2x శాశ్వత ‖
Verse
దూతలు చేయని నీ దివ్య సేవను
ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే‖ 2x ‖
ధూపార్తిని చేపట్టి చేసెద‖ 2x శాశ్వత ‖
Verse
భక్తిహీనులతో నివసించుటకంటెను
నీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట‖ 2x ‖
వేయిదినాల కంటే శ్రేష్టమైనది‖ 2x శాశ్వత ‖
Verse
సీయోను శిఖరాన సిలువ సితారతో
సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడెద‖ 2x ‖
సీయోను రారాజువు నీవేగా‖ 2x శాశ్వత ‖
Verse
నూతనమైన ఈ జీవ మార్గమందున
నూతన జీవము ఆత్మాభిషేకమే‖ 2x ‖
నూతన సృష్టిగా నన్ను మార్చెను‖ 2x శాశ్వత ‖