Verse
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా
కృప చూపి నన్ను రక్షించవయ్యా‖ 2x ‖
నీ ప్రేమ గొప్పది – నీ జాలి గొప్పది
నీ కృపా గొప్పది – నీ దయ గొప్పది‖ 2x ‖
Verse
అనాథనైనా నన్ను వెదకి వచ్చావు
ఆదరించి కౌగిలించి హత్తుకొంటివి‖ 2x నీ ప్రేమ ‖
Verse
అస్థిరమైన లోకములో తిరిగితినయ్యా
సాటిలేని యేసయ్య చేర్చుకొంటివి‖ 2x నీ ప్రేమ ‖
Verse
తల్లి గర్భమందు నన్ను చూచియుంటివి
తల్లిలా ఆదరించి నడిపించితివి‖ 2x నీ ప్రేమ ‖
Verse
నడుచుచున్న మర్గమంత యోచించగా
కన్నీటితో వందనములు తెలుపుదునయ్యా‖ 2x నీ ప్రేమ ‖
Verse
ప్రభువు చేయవలసినది ఆటంకం లేదు
సమస్తము మేలుకై చేసిన దేవా‖ 2x నీ ప్రేమ ‖