Verse
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె‖ 2x ‖
కాచిన కృప‖ శాశ్వతమైనది ‖
Verse
నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి‖ 2x ‖
నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో‖ 2x శాశ్వత ‖
Verse
తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే‖ 2x ‖
నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే‖ 2x శాశ్వత ‖
Verse
పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన‖ 2x ‖
నా కృప నిను వీడదని అభయమిచ్చితివే‖ 2x శాశ్వత ‖