Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shaashwathamu Kaadu Ee Lokamu

శాశ్వతము కాదు ఈ లోకము

Shaashwathamu Kaadu Ee Lokamu

Verse
శాశ్వతము కాదు ఈ లోకము
నా గమ్యము ఆ పరలోకము‖ 2x ‖
నా గమ్యస్థానము నా యేసుని యందే
యుగయుగములకు ప్రభుతో వసియింతును‖ 2x శాశ్వతము కాదు ‖
Verse
స్థలమును సంసిద్ధము చేయుటకు
వెళ్ళాడు నా కొరకే ప్రభు యేసుడు‖ 2x ‖
నా తండ్రి గృహముకు నను చేర్చడానికి
వస్తాడు వేగమే నను కొనిపోవుటకు‖ 2x శాశ్వతము కాదు ‖
Verse
ఆవిరి వంటిది ఈ జీవితం
ఏ క్షణమో తెలియదుగా నా అంతము‖ 2x ‖
నా ప్రియుడు నా కొరకై రాబోయే దినమో
ప్రేమతో తన ఇంటికి నను పిలిచే క్షణమో‖ 2x శాశ్వతము కాదు ‖
Verse
నా ప్రభుని ఇంటిలో నాకు ఎప్పుడూ
సంతోషమే సమాధానమే‖ 2x ‖
ఈ లోక యాత్ర ముగిసిన వేళ
నా తండ్రి రొమ్మున నేనుందును‖ 2x శాశ్వతము కాదు ‖

Related Tags

Second ComingHeavenEternity