Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shakthi Chetha Kaadu

శక్తి చేత కాదు

Shakthi Chetha Kaadu

Lyricist: Akumarthi Daniel
Verse
శక్తి చేత కాదు
బలము చేత కాదు
దేవుని ఆత్మచే
సమస్తము సాధ్యము‖ 2x శక్తి ‖
Verse
నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని
చేసెను దేవుడు శూన్యము నుండి‖ 2x ‖
తన రూపులో తన పోలికలో‖ 2x ‖
నిర్మించెను దేవుడు నరుని మంటి నుండి‖ 2x శక్తి ‖
Verse
కౄరమైన సింహాల బోనైననూ
విశ్వాసముతో సాగెను దానియేలు‖ 2x ‖
అగ్ని గుండములో మరణ శాసనములో‖ 2x ‖
ఇమ్మానుయేలు యేసయ్య తోడుగా‖ 2x శక్తి ‖
Verse
ఘోరమైన పాపాల బానిసైననూ
భారమైన బ్రతుకును గడుపుచున్ననూ‖ 2x ‖
ప్రియమార నిన్నే పిలువంగ యేసు‖ 2x ‖
దరి చేర రావా ఆ ప్రేమ నాథుని‖ 2x శక్తి ‖

Related Tags

FaithCreationDeliveranceGods Power