Verse
శక్తిగల షాలేమురాజా షారోను రోజా
స్తుతియించెదము యేసు
Verse
పూర్వమున పల్కిన నీ ప్రవచవోక్తులన్ని
చక్కగను మక్కువతో చేసితివి నీవు - చేసితివి నీవు
పూర్వమున చూపిన నీ ప్రత్యక్షతలన్ని - వరుసగను జరిపితివి నిన్ను
పోలినవాడు వేరెవ్వరు లేరు
Verse
బయలు పరచినట్టి నమూనాను పోలి నాడు
బలముగను నీదు ప్రత్యక్ష గుడారమును - నీ గుడారమును
కట్టితివి నీ దాసుడై నట్టి మోషే ద్వారా
నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను - ప్రభావ మహిమను
Verse
షాలేము యెసూషలేములోని ఆలయము
సొలొమోను ద్వారా కట్టించిన మహారాజా - కట్టించిన రాజా
ఆలయమును నిర్మించినట్టి మహారాజా
నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను - ప్రభావ మహిమను
Verse
కాలము సంపూర్ణముగ పరిణమించగానే
కన్య గర్భమున ప్రభో జన్మించితి వీవు - జన్మించితి వీవు
కట్టెదను నా సంఘము నని సెలవిచ్చి
కట్టుచున్నావు మమ్ముల నీ స్వరూపమునకు - నీ ఆలయముగను
Verse
హస్తకృతాలయములో వసించని నీవు
వింతగాను మా మధ్యను ఉండగోరినావు - ఉండగోరినావు
కాంతివంతమైన నీదు మహా మహిమతోనే
స్వంత వారినంత నింప తీర్మానించినావు - తీర్మానించినావు
Verse
అక్కడను ఇక్కడ నొక్కొక్కరిని యేరి
అద్భుతముగను జత చేయువాడ వీవు - చేయువాడ వీవు
నూతన దంపతులను వింతగా దీవించి
అంతకంతకు వర్ధిల్ల జేయువాడ వీవే - కాయువాడ వీవే
Verse
వ్యక్తులను కుటుంబములనుగా మార్చివేసి
శక్తిగల సంఘ వధువుగ మార్చివేసి - నీవే మార్చివేసి
వింతగా నా వధువునకు వరుండవై నావు
ఆంతము లేదహా నీ మహిమ రాజ్యమునకు - హల్లెలూయా ఆమెన్