Verse 1
షాలేము రాజా నా యేసయ్యా
సర్వోన్నతుడా నా ప్రభువా
Verse
నేను ఏర్పరచిన వారు నాకు
ప్రార్ధన చేయగా న్యాయము తీర్చనా ?
అని పలికిన నా యేసయ్య
అని చెప్పిన నా తండ్రివయ్యా
Verse
కష్టాల కడలిలో నేనున్నప్పుడు
ప్రార్థన చేయగా ఆలకించినావు
ఉత్తరమిచ్చి ఆదరించినావు
అభయ హస్తముతో బలపరచినావు
Verse
విసుకక నీవు ప్రార్ధన చేయుమన్నావు
అలయక నీవు మొఱపెట్టమన్నావు
నా ప్రార్థనను ఆలకించినావు
నా మొరలన్నియు సఫలపరిచినావు