Verse
శాంతి సంతోషం పాపక్షమాపణ సదా యేసులో దొరుకున్
చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్ ఆ... ఆ...‖ 2x ‖
Verse
కొంత కాలంబే ఈ లోకము
అంతలో కనబడి మాయమగున్‖ 2x ‖
చింతలన్నియు వీడి ప్రభు చెంత జేరిన
సంతసముగ యిచ్చు నిత్య సుఖముల్
Verse
సకల సంపదలు ఆస్తులుయున్నన్
సకలంబు ఒకనాడు సమసిపోవున్
సర్వంబు నీవే అని మోసపోకుము
సర్వంబు నీకు ప్రభువే నమ్ము
Verse
సంపూర్ణ రక్షణ ప్రభు యేసు యిచ్చున్
సంపూర్ణ తృప్తి ప్రభులో దొరుకున్
పూర్ణభాగ్యము నీకు సిద్ధపరచెను
పూర్ణ మనసుతో పరుగిడి రమ్ము