Verse
శాంతిదాయక యేసు ప్రభూ
శాంతిదాయక యేసు శాంతిదాయక
Verse
ధవళవర్ణుడ రత్న వర్ణుడ - మహిమపూర్ణుడ మనోహరుడా
నిత్య రాజ్య మహిమకు పిల్చిన - సత్యముగ నిన్ను పూజించెదము
Verse
పరజనులను పరదేశులను - పరిశుద్ధులతో నైక్యపరచి
పరలోక పౌరులుగా మార్చి - పరలోక పిలుపుకు లోబర్చిన
Verse
సువార్తతో మమ్ము పిలిచితివి - సువార్తికులుగ చేసితివి
రిక్తులకు మాదైశ్వర్య మిచ్చి - శక్తితో వారసులుగ చేసిన
Verse
ఆదియం దేర్పరచు కొంటివి - ఏవి నీచమో ఏవి ఘనమో
గురుతుపట్టి ఎరుగ మంటివి - నోరుగ జేతునను వాగ్దానము
Verse
స్వర్ణమయుడా కాంక్షణీయుడా - పదివేలలో గుర్తింప యోగ్యుడా
బోధింప నేర్పు శుద్ధాత్ముని - శోధింపలేని ఐశ్వర్యము నిచ్చె
Verse
అక్షయ జీవమిచ్చిన రక్షక - పరీక్షలో నిల్చు నిరీక్షణలో
అక్షయ దేహ మిచ్చెదవని - ప్రత్యక్షతకై వేచియుండెదము
Verse
సర్వ కృపానిధి సర్వేశ్వరా - సర్వము స్వతంత్రించుకొన
ఉర్వియందు విజయములే యని - సర్వోన్నతుడు నుడివెను
Verse
పరలోకానంద పరిపూర్ణుడా - సకలాశీర్వాద సంయుతుడా
మహిమ ఘనత ప్రభావంబులు - నీవే యని ప్రహర్షించెదము