Verse
శరణం శరణం శరణం దేవా - కరుణ నాథుడా
కరుణ నాథుడా - ఈ తరుణమే ప్రభో
Verse
పాపరహిత దేవకుమారా - శాపవాహకా
శాపవాహకా - నిత్య కోప రహితుడా
Verse
పరిపూర్ణ దేవుడా - నరావతారుడా
నరావతారుడా - మా యేసు నాథుడా
Verse
దయామయుండ క్రీస్తు యేసు - దాక్షిణ్య ప్రభువా
దాక్షిణ్య ప్రభువా - బాహుళ్య దేవుడా
Verse
నమ్మదగిన లోకరక్షకా - సర్వోపకారుడా
సర్వోపకారుడా - సర్వశక్తిమంతుడా
Verse
సాత్వికుండా - సర్వజనుల కాంక్షణీయుడా
కాంక్షణీయుడా - వాత్సల్య దేవుడా
Verse
రిక్తుడై తగ్గించుకొనిన - వినయపూర్ణుడా
వినయపూర్ణుడా - మముగాచు దేవుడా
Verse
సత్యవంతుడవు - మాదు నిత్యదేవుడా
నిత్యదేవుడా - మా మంచి బోధకుడా
Verse
సర్వలోక సృష్టికర్త - సత్యదేవుడా
సత్యదేవుడా - మా నిత్యజీవమా
Verse
ఎల్లరిలో శ్రేష్ఠుడా - మా వల్లభుండవు
వల్లభుండవు హల్లెలూయ పాడెదం