Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sharanu Sharanu Yesu Deva Nannu Karu

శరణు శరణు యేసు దేవా నన్నుఁ గరు

Sharanu Sharanu Yesu Deva Nannu Karu

Lyricist: Mikkili Samuel
Chorus
శరణు శరణు యేసు దేవా నన్నుఁ గరుణింపవే నిత్య జీవా పరమ
దేవుని తనూ భవుఁడవై ధరణిలో నర రూపమైతివి నరులను రక్షింప‖ శరణు ‖
Verse
దైవోగ్రమునకుఁ బాత్రుఁడను విమల భావమునకే నసహ్యుఁడను
గావరించిన పాప కర్ముఁడన్ కఠినుఁడన్ జానవలసిన యట్టి స్వామి
ద్రోహు డ నయ్య శరణు‖ శరణు ‖
Verse
మద మత్సరమ్ములు మెండై నాదు మది నాక్రమించెను నిండై
సదయుండ నీ దివ్య సర్వాజ్ఞలన్ మీరి విదితముగఁ బాపముల్ వేడ్కను
జేసితి శరణు‖ శరణు ‖
Verse
మోసంబులోఁ జిక్కి చాల నేను దోసంబు చేసితినిల యేసు నాధుని
సిలువ నేమాత్రమైన నే నాసతోఁ జూడని యన్యాయ పరుఁడను శరణు‖ శరణు ‖
Verse
నెమ్మ దించుక యైన మదిలో లేక గ్రమ్ముకొని యఘము నా యెదలోఁ
ద్రిమ్మరినై భువిన్ దిరిగి వేసారఁగ సమ్మతము దొరక దో సర్వేశ నీకంటె శరణు‖ శరణు ‖
Verse
నా తండ్రి యో యేసునాధా నిన్ను ఘాతఁజేసిన దేనుగాదా నీతిమాలిన
పాప నీచుఁడన్ దుష్టుఁడన్ నా తప్పు క్షమియించి నన్నేలి రక్షించు
Verse
కడుదయా శాంతస్వభావా నన్ను దడవుజేయక యేలుకోవా యొడబడి
కుజనులకై యోర్చియలసటను బడి జీవమిడిననా ప్రాణ రక్షక కావు శరణు‖ శరణు ‖

Related Tags

DevotionalPrayerRepentance