Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sharanun Jochchithi Yesunaadhuda Shaktha

శరణుఁ జొచ్చితి యేసునాధుఁడ శక్త

Sharanun Jochchithi Yesunaadhuda Shaktha

Lyricist: Mikkili Samuyelu
Chorus
శరణుఁ జొచ్చితి యేసునాధుఁడ శక్తిహీనతఁ గల్గె నా దరణ మిమ్మిల
నెవ్వఁ బొందితి దవ్వుసేయక కావవే‖ శరణు ‖
Verse
కరుణఁ జూడుము కన్న తండ్రివి కల్మషం బెడఁబాపవే మరణ మొందక
మున్ను నన్నిల మార్పు నొందఁగఁ జేయవే‖ శరణు ‖
Verse
మొరను జెచ్చెర నాలకించుచు మోము నా దెసఁ జూపవే యురు
పదంబుల సేవఁ జేసెద నుద్ధరించుము కూర్మితో‖ శరణు ‖
Verse
తామస క్రియలందు వాంఛలు తాకకుండగఁ జేయవే క్షేమమైన సువార్త
బోధల సిద్ధపడి విననీయవే‖ శరణు ‖
Verse
శ్రమలు చాల కల్గి యున్నను సైఁప నేర్పుము సత్కృపన్ గమిలి పోయెడి
మాయ లోకపు గాంతి నీరస మంచు నీ‖ శరణు ‖

Related Tags

PrayerRepentanceSurrender